calender_icon.png 17 January, 2025 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజినేపల్లి తహశీల్దార్ కార్యాలయానికి తాళం

07-08-2024 11:29:44 AM

తమకు రావాల్సిన వాటా ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయడంపై రైతుల నిరసన, 

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): తమకు రావాల్సిన వాటా ఇతరుల పేర్ల మీద రిజిస్టేషన్ చేయడాన్ని నిరసిస్తూ రైతులు తహశీల్దార్ కార్యాలయానికి తాళం వేశారు. ఈఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం తహశీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన మగ్ధుమ్ బాలయ్య 14ఏళ్ల కిత్రమే మరణించారు. తనకున్న 27 ఎకరాల్లో ప్రభుత్వం 2 ఎకరాలను కెఎల్ఐ కాల్వకు భూమిని సేకరించింది. మిగిలిన 25 ఎకరాలను బాలయ్య వారసులైన శ్రీశైలం, వెంకటయ్య, బాలయ్య, పార్వతమ్ము, నాగయ్యలు 5 మంది హక్కుదారులుగా ఉన్నారు.

కాగా బిజినేపల్లి తహశీల్దార్ శ్రీరాములు అత్యుత్సాహంతో 14 ఏళ్ల క్షేత్రం మరణించిన పట్టదారు బాలయ్య పేరుతో ఉన్న మూడవ వాటాచారు బాలయ్య వారసులకు అప్పనంగా 25 ఎకరాలను అక్రమ రిజిస్ట్రేషనర్ చేశారు. 14ఏళ్ల క్రితం మణించిసిన బాలయ్య తిరిగి బతికొచ్చినట్లుగా మూడవ వాటాదారైన మూడవ కుమారుడు బాలయ్య తన వారసత్వం కింద నరేష్, రాములు, మల్లేష్, యాదమ్మ, విజయమ్మల పేర గత 5నెలల  క్షేత్రం అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. విషయం కాస్తా మిగతా నలుగురు నిజమైన వారసులకు తెలియడుతో అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం బయటపడింది. దీంతో దిద్దుబాటు చర్యగా తిరిగి రిటర్న్ చేయిస్తానంటూ తహసీల్దార్ కాలం వెల్లదీయడంతో మంగళవారం బాదితులు తహశీల్దార్ కార్యాలయానికి తాళం చేశారు. అటెండర్ విడుల్లో వచ్చేసరికే కార్ద్యాలయానికి మరో తాళం వేసి ఉండులో విషయం తెలుసుకున్నన్న ఆర్టీఓ ఎస్పై సహకారంతో బాదితులకు సర్దిచెప్పి పంపారు.