05-04-2025 12:33:42 AM
పనులు చేయకుండానే బిల్లులు డ్రా
చేసిన పనుల్లో నాణ్యతలేమి
కొరవడిన పర్యవేక్షణ
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 4 (విజయ క్రాంతి) :ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించి, కార్పొరేట్ స్థా యి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభు త్వం రాష్ట్రవ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో రూ కోట్ల నిధులు విడుదల చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల నిధుల వ్యయాన్ని మహిళా స్వయం సహాయక సంఘాల సేవ ల్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కొన్ని పాఠశాలల్లో స్వయం సహాయక సంఘాల ఊసే లేకుండా పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారి నిధులు పక్క దారి పడుతున్నాయి.
చేస్తున్న పనుల్లో నాణ్యత లోపించడమే కాకుండా, కొన్ని పాఠశాలల్లో పనులు చేయకుండానే నిధులు డ్రా చేస్తున్నట్లు ఆరోపణ లు వెలువడుతున్నాయి. పథకం ప్రారంభంలో ప్రభుత్వము, జిల్లాస్థాయి అధికారు లు అమ్మ ఆదర్శ పాఠశాలలపై సమీక్ష నిర్వహించి, పర్యవేక్షణ నిర్వహించారు. ఆ తర్వా త అమ్మ ఆదర్శ పాఠశాలలపై ఎలాంటి సమీక్షలు, తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిందని చెప్పక తప్పడం లేదు.
పథకం తీరును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలోని అన్నపురెడ్డిపల్లి మండలం మర్రెగూడెం ఎంపీపీ పాఠశాల లో పరిశీలిస్తే పథకం తీరు ఎలా ఉందో తేటతెలమవుతుంది. ఈ పాఠశాలకు మౌలిక సదుపా యాల కల్పనకు మొదటి దశలో సుమారు రూ 2 లక్షల నిధులు కేటాయించారు. వా టితో తాగునీటి సౌకర్యానికి రూ 1 లక్ష, మరుగుదొడ్ల సౌకర్యానికి రూ 70 వేలు, విద్యుదీకరణకు రూ 25 వేలు కేటాయించారు.
వాస్తవంగా ఈ పనులన్నీ గత ఏడాది పాఠశాల ప్రారంభం లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యా సంవత్సరం పూర్తి అవుతున్న నేటికీ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. చేసిన పనుల్లోనూ నామ మాత్రపు నాణ్యత ప్రమాణాలు పాటించినట్లు తెలుస్తోంది. జరుగుతున్న పనులపై ఎంఈఓ కేటాయించిన ఇంజనీరింగ్ శాఖ ఏఈ, అమ్మ ఆదర్శ కమిటీలు పర్యవేక్షణలో పనులు జరగాల్సి ఉంది.
కానీ ఈ పాఠశాలలో ఎవరు పర్యవేక్షణ చేసిన దాఖలాలు లేవు.విద్యుదీకరణకు పాత వైర్లనే సరిచేస్తున్నారని, తాగునీటి సౌకర్యం కోసం పాఠ శాలకు మిషన్ భగీరథ మినీ వాటర్ ట్యాంక్ నుంచి పైప్ లైన్ ఏర్పాటు చేశారు, టాప్ లు బిగించారు కానీ వాటర్ మాత్రం సరఫరా కావడం లేదు. ఉన్న పంచాయతీ బోరుకు మోటర్ బిగించి నీటి సరఫరాకు ప్రయత్నం చేపట్టిన అది చెడిపోయి ఉపయోగ పడటం లేదు . దీంతో పాఠశాల విద్యార్థులకు తాగునీటి సమస్య తాండవిస్తోంది. పాఠశాలలో మరుగుదొడ్ల సౌకర్యం కల్పించినప్పటికీ వాటికి నీటి సరఫరా మరిచారు. విద్యార్థుల బకెట్లతో నీటి తీసుకొని పోవలసిన దుస్థితి ఏర్పడింది. అంతేకాదు సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం మార్చారు.
బాధ్యతలు మరిచిన అమ్మ ఆదర్శ కమిటీలు
అమ్మ ఆదర్శ పాఠశాలలుగా ఎంపికైన పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలను అధికారులను నియమించారు. వారు పాఠశాల లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సి ఉంది. మరుగుదొడ్లు నిర్మాణం, తాగునీటి సౌకర్యం, పాఠశాలలో మైనర్ మరమ్మతులు, తరగతి గదుల్లో విద్యుదీకరణ, పాఠశాలల ప్రాంగణంలో పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ బిల్లులను తగ్గించేందుకు సోలార్ ఫ్యాన్లను ఏర్పాటు చేయుట, విద్యార్థులకు యూనిఫామ్ కుట్టి అందజేయడం చేయాల్సి ఉంది. కానీ ఏ పాఠశాలలోనూ మా ఆదర్శ పాఠశాల కమిటీలు తమ బాధ్యతలను విష్మరించారని ఆరోపణలు వస్తు న్నాయి.
ఇ ప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు అమ్మ ఆదర్శ పాఠశాల లపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యత ప్రమాణాలతో పను లు జరిగేలా చర్యలు తీసుకోవాలని,తద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరు తుందని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై అన్నపురెడ్డిపల్లి మండల విద్యాధికారి ఆనంద్ కుమార్ ను వివరణ కోరగా. గతంలోనే ఆ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల నిధులతో పనులు చేపట్టే పూర్తి చేశారన్నారు. పనులు జరగకుండా బెల్లు తీసుకోవడం అనే ఆరోపణ అవాస్తవమని, ఆ పనులన్నీ పూర్తయ్యాయన్నారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం విద్యుదీకరణ పనులు పూర్తయినట్టు తెలిపారు. ప్రస్తుతం రూ 4 లక్షలతో వరహరి గోడ నిర్మాణానికి నిధులు మంజూరైనట్టు తెలిపారు. పనులన్నీ మహిళా సంఘాల ద్వారానే చేస్తున్నామన్నారు.