08-04-2025 01:40:17 AM
సుంకాల ప్రభావంపై బ్రిక్స్‌వర్క్ రేటింగ్ సంస్థ నివేదిక
హైదరాబాద్, ఏప్రిల్ 7: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలు భారత్‌పై ఏవిధంగా చూపనున్నాయనే అంశంపై ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ‘బ్రిక్‌వర్క్ రేటింగ్’ పూర్తి విశ్లేషణాత్మక నివేదికను తాజాగా విడుదల చేసింది. అమెరికా విధించిన 26శాతం సుంకాలు భారత జీడీపీని 31 బిలియన్ డాలర్లమేర ప్రభావితం చేయనున్నట్టు వెల్లడించింది. దేశంలోని టెక్స్‌టైల్స్, ఫార్మా, ఐటీ ఉత్పత్తులపై వీటి ప్రభావం ఉంటుందని చెప్పింది.
స్టీలు, అల్యూమినియం వంటి రంగాలను మినహాయించిన కారణంగా ఆయా రంగాలు దేశంలో మరింత వృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. టైక్స్‌టైల్స్ రంగంలోని ఎస్‌ఎంఈలు, ఎంఎస్‌ఎంఈలు వంటి రంగాల పరిశ్రమలకు అమెరికా ఆర్డర్లు తగ్గిపోయి పరిశ్రమల మూసివేతకు దారి తీయోచ్చని అంచనా వేసింది. ఇదే జరిగితే ఆయా పరిశ్రమల్లోని ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది.