calender_icon.png 25 February, 2025 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో బిల్ కలెక్టర్, అసిస్టెంట్

25-02-2025 02:27:47 AM

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 24: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో తన సహాయకుడి ద్వారా రూ.45 వేలు లంచం తీసుకుంటూ బిల్ కలెక్టర్ మధు సోమవారం ఏసీబీకి చిక్కాడు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని ఇందిరాగాంధీ రెసి డెన్సియల్ సొసైటీలో నిబంధనలకు విరుద్ధంగా వందలాది షెడ్లు వెలిశాయి. అందులో వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఓ వ్యక్తికి సంబంధించిన షెడ్డు విషయంలో ఆస్తిపన్ను పెంచకుండా ఉండాలంటే రూ.లక్ష లంచం ఇవ్వాలని బిల్ కలెక్టర్ మధు డిమాండ్ చేశాడు. చివరకు రూ.45 వేలు తీసుకునేందుకు అంగీకరించాడు.

సోమవారం మధ్యాహ్నం ఆయన మైలార్‌దేవ్‌పల్లిలోని వార్డు కార్యాలయం వద్ద మధు తన ప్రైవేట్ సహాయకుడు రమేశ్ షెడ్డు యజమాని నుంచి రూ.45 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు వారిద్దరిని అదుపులోకి ఏసీబీ అధికారులు తీసుకున్నారు. కాగా బిల్ కలెక్టర్ తో పా టు అతడి సహాయకుడు పట్టుబడటంతో ఏసీబీ అధికారులు రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్‌ను విచారించారు. లంచం తీసుకున్న వ్యవహారంలో మీ ప్రమేయం ఉందా సుదీర్ఘంగా విచారణ జరిపారు. వివిధ శాఖల అధికారుల తీరుపైనా విచారణ జరిపినట్లు సమాచారం.