15-02-2025 01:20:25 AM
కొత్త బైకుల చోరీ సాకుతో భీమా డబ్బులు దండుకుంటున్న కేటుగాళ్లు
అమాయకులకు బైకులు అంటగడుతున్న వైనం
న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు
నిజామాబాద్ : ఫిబ్రవరి 13:(విజయ క్రాంతి): కింగ్ కోఠీ టూ ఆర్మూర్ వరకు విస్తరించిన బైక్స్ స్కామ్ బోకర్స్ ఏజెన్సీల బాగోతం వెలుగు చూసింది. భారీగా జరిగిన ఈ కుంభకోణం దర్యాప్తును పోలీసులు కావాలిగా తీసుకున్నారు. ఈ బైక్స్ స్కామ్ ఆర్మూర్‌కు చెందిన ప్రజా ప్రతినిధి అనుచరుడి మెడకు చుట్టుకుంటోంది. ఎలాంటి పత్రాలు లేకుండా సగం ధరలకే బైకులను అమాయకులకు అంట గట్టి నిలువునా ముంచుతున్నరు. బైక్ మాఫియా ఈ బాగోతంతో సంబంధం ఉన్న కింగ్ కోటి లోని కొన్ని దుకాణాలు బోగస్ ఏజెన్సీల బాగోతం పై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. సగం దర కే బైకులు వస్తున్నాయి అన్న అత్యాశతో బైక్ లను కొన్నవారు.
లబోదిబోమంటున్న స్థానాలకు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు. బైకులకు సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్త డం తో పోలీసులు రంగంలోకి దిగి తమ దర్యాప్తు మొదలుపెట్టారు. కేటుగాళ్ల కోసం వేట, మొదలుపెట్టిన పోలీసులకు ఆర్మూర్ డివిజన్ లో పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాల ను పోలీసులు సీజ్ చేశారు. ఈ భారీ కుంభకోణం వెనుక రాజకీయ నాయకుల అనుచరులు ముఖ్యంగా ప్రజా ప్రతినిధి అనుచరులే ఈ బైక్ స్కామ్ ప్రధాన పాత్ర ధారులుగా ఉన్నట్టు సమాచారం. ఆర్మూర్ డివిజన్లో అమాయకులను మోసం చేస్తూ అక్రమ బైక్ ల దందానూ గత కొన్ని సంవత్సరాలుగా కేటుగాళ్లు సాగిస్తున్నారు. ఈ దందాలో ఖరీదైన ద్విచక్ర వాహనాలను కొని వాటిని మాయం చేసి వాటి తాలూకు బీమా డబ్బులను సొమ్ము చేసుకుంటు న్నారు.
ఆ తర్వాత వాటిని అమాయకులకు అమ్మడం బైకును విడిభాగాలుగా విడదీసి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నార. ఈ కుంభకోణంపై విచారణ మొదలైన మరు క్షణం నుండి కేసుల మాఫీకి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ బైకుల బాగోతం తేల్చడానికి పోలీసులుచేపట్టిన దర్యాప్తు సిబ్బంది పని తీరు పట్ల పోలీసుల పై జిల్లా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. యధేచ్చగా సాగుతున్న ఈ బైక్స్ మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. హైదారాబాద్ లోని కింగ్ కోఠీలో వివిధ సంస్థలకు సంబంధించిన కొత్త బైకులను విక్రయించే బోగస్ ఏజెన్సీలను ఏర్పాటు చేసుకొని. ఆ ఏజెన్సీల తో పేరుమోసిన కంపెనీల నుంచి కొత్త బైకులను కొంటారు.
అనంతరం వాటిని నిబంధనల ప్రకారం వినియోగదారులకు విక్రయించ కుండా ఆ బైకులు చోరీ కి గురయ్యాయని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తారు. ఆ బోగస్ ఏజెన్సీల మాటలు నమ్మి పోలీసులు కేసులు నమోదు చేస్తారు. ఆ కేసులకు సంబంధిం చిన ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా బోగస్ సంస్థలు పేర్కొన్న బైకులు చోరీకి గురైనట్టు చిత్రీక రిస్తారో అన్ని బైకు లకు బీమా సొమ్ము క్లెయిమ్ చేస్తారు. బీమా సొమ్ము చేతికి అందిన మరుక్షణం ఆ బైకులను అమ్ముకొని డబ్బులు దండుకుంటారు. ఈ బాగోతం అంతా నిజామాబాద్ ఆర్మూర్ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ కింగ్ కోటి వరకు వ్యాపించింది. బీమా సొమ్ము చేతికి అందిన అనంతరం ఆ బైకులు ఎలాంటి రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా గ్రామీణ ప్రాంతాలకు చెందిన అమాయకులకు విక్రయిస్తూ మరోమారు సొమ్ము చేసుకుంటున్నారు.
తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని ముఠాలు ఈ దందాను మొండిచేత్తో నడిపిస్తున్న ముఠా కొన్ని బైకులను సగం ధరలకే అమ్ముకోవడం, మరి కొన్ని బైకులను విడి భాగాలుగా అమ్ముకోవడం చేస్తున్నారు. ఈ బైకులను ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. కింద గ్రామీణ యువతనే లక్ష్యంగా చేసుకొని ఈ చోరీ బైకులను వాళ్ళకి అంటగడుతు సొమ్ము చేసుకుంటూ న్నారు. ఇతర జిల్లాల్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరకు వాటిని విక్రయించడమే పనిగా పెట్టుకున్నారు. అమాయకులను నిలువునా ముంచుతున్న మాఫియా ఆగడాలు ఆర్మూర్ నియోజక వర్గంలో విచ్చలవిడిగా సాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ బోగస్ ఏజెన్సీల బండారం వెలుగుచూడ టంతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేటుగాళ్ల కోసం వేట మొదలు పెట్టారు. మొన్నటి వరకు చేతికి బ్రాస్లెట్లు మెడలో బంగారు గొలుసులు కాస్ట్లీ కారులలో తిరిగిన ఈ ముఠా సభ్యులు అనిపించ కుండా పోయారు.
ఒక్క ఆర్మూర్ నియోజక వర్గంలోనే పెద్ద ఎత్తున ఈ వాహనాలను విక్రయించి అట్టు తెలుస్తోంది. ఈ డివిజన్ లోనే పోలీసులు దొంగ బైకులను అధిక మొత్తంలో ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అంకాపూర్ లో 5, మిర్దాపల్లిలో 10, డొంకేశ్వర్ లో 2, మైలారంలో15 దొంగ బైకులను పోలీసులు సీజ్ చేయడం ఆర్మూర్ డివిజన్లో కలకలం రేపింది. దర్యాప్తులో ఈశ్వరి బైకుల సంఖ్య ఇంకా పెరగనుంది. ఇదిలా ఉండగా ఈ భారీ కుంభకోణం వెనుక ఆర్మూర్ బడా నాయకుడి అనుచర గణం ఈ నిర్వాకానికి పాల్పడినట్టు తెలు స్తోంది. ప్రజా ప్రతినిధి కమిషనర్‌లో నడిచే చోట మోట నాయకులు గా చెప్పుకునే పలువురు అనుచరులతో పాటు ఆయన సమీప బంధువు కూడా ఈ బైక్లో స్కామ్ లో పాత్రధారులని పోలీసులు భావిస్తున్నారు.
కార్యకలాపాలకు సంబంధించి పెద్ద ఎత్తున వచ్చిన ఆరోపణలతోనే ఉక్కిరిబిక్కిరి అవు తున్న ప్రజా ప్రతినిధి తాజాగా గణం ఇరు క్కున్న ఈ బైక్ స్కాం కేసులతో సతమతం అవుతున్నారు. ఈ బైకు స్కామ్ సూత్ర ధారిగా ప్రజా ప్రతినిధి ప్రధాన అనుచరుడు ఉండడంతో ప్రజల దృష్టిలో ఆ నాయకుడు మరింత చులకనయ్యారు. కాగా బైకుల కుంభకోణానికి సంబంధించిన కేసుల మాఫీకి కై యత్నాలు మొదలయ్యాయని తెలుస్తోంది. దీంతో ఈ బైక్‌ల దందా దర్యాప్తు వేగవంతంగా సాగడం లేదన్న విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీ సుల తీరుపై జిల్లా ఇంచార్జ్ పోలీస్ అధికారి ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఇకనైనా పోలీస్ శాఖ ఈ బైకుల కుంభకోణం పై సమగ్ర విచారణ చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆర్మూర్ డివిజన్ కు చెందిన బాధితులు పోలీస్ శాఖ అధికారులను కోరుతున్నారు.