calender_icon.png 22 April, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైకుల దొంగ అరెస్ట్.. రిమాండ్

22-04-2025 12:09:06 AM

ఎల్బీనగర్, ఏప్రిల్ 21 : విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి  అవసరాల కోసం సులభంగా డబ్బులు సంపాదించడానికి నివాస  పార్కింగ్ స్థలాల్లో పార్కు చేసిన 10 బైకులను దొంగిలించి మెట్రో పార్కింగ్ స్టేషన్లో దాచిపెడుతున్న  ఒక దొంగ పోలీసులకు చిక్కాడు.

పోలీసులు తెలిపిన వివరాలు...  ఎల్బీనగర్ లోని  మైత్రీ నగర్ కాలనీకి చెందిన  కుమ్మరి బాలరాజు అలియాస్ సన్నోతుల బాలరాజు (50) విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాధించడానికి బైక్ దొంగగా మారాడు. వాహనాల తనిఖీల్లో బాలరాజు పట్టుబడ్డాడు. ఇతడిని ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడి నుంచి రూ. 7 లక్షల విలువ చేసే పది బైకులను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో 3, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో 3, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఒకటి, మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఒకటి, మాలక్ పేట్ లో ఒకటి,  అంబర్ పేట్ లో ఒకటి మొత్తం పది కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు బాలరాజును ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.