నిజామాబాద్,(విజయక్రాంతి): నిజామాబాద్ కోరుట్ల, మెట్పల్లి, నవీపేట్ మండలాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడిన నిందితుడిని నగర వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం పోలీస్ స్టేషన్ ఎస్ఐఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం... మార్కులు మండలం మామిడిపల్లికి చెందిన కరిపే సుమన్ అనుమాస్పదంగా కనిపించాడు. అతని అదుపులోకి తీసుకొని విచారించి, నిందితుడి నుండి ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీలు చేస్తుండగా అనుమానస్పదంగా కనిపించిన సుమన్ ను పట్టుకొని సాధించడంతో నేరం అంగీకరించాడని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచినట్టు రఘుపతి తెలిపారు.