calender_icon.png 19 April, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైకుల దొంగ అరెస్ట్

19-04-2025 12:47:37 AM

జహీరాబాద్, ఏప్రిల్ 18 :జహీరాబాద్ పట్టణంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా మోటార్ బైకులు దొంగతనం చేసే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నాడు బస్టాండ్ ముందు సిగ్నల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా జహీరాబాద్ సుభాష్ గంజికి చెందిన మొహమ్మద్ అల్తాఫ్ హుస్సేన్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

జహీరాబాద్ లోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడని, గత సంవత్సరం నుండి బైకులు దొంగతనం చేస్తున్నాడని చెప్పారు. దొంగతనం చేసే సమయంలో ఎవరైనా అడ్డుకుంటే వారిని తప్పించుకునేందుకు కత్తితో బెదిరించైనా లేక వారిని చంపడానికి చాకు, కమ్మ కత్తిని ఉపయోగిస్తుంటాడని ఆయన తెలిపారు.

జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. జహీరాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం, జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ కాశీనాథ్ సీసీ కెమెరాలు, వాహనాల తనిఖీ ముమ్మరం చేసి నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు.

నిందితుని వద్ద ఎనిమిది మోటార్ సైకిళ్లు, చాకు, కమ్మ కత్తి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దొంగను పట్టుకోవడానికి ఐడి పార్టీ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ నర్సింలు, కానిస్టేబుళ్లు సంజీవరావు, ఓం దేవ్, అస్లాం, ఆనంద్ను డీఎస్పీ రామ్మోహన్ రెడ్డిఅభినందించారు.