22-12-2024 01:40:11 AM
అశ్వారావుపేట, డిసెంబర్ 21: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో శనివారం ఉదయం పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా బైక్ దొంగ పట్టుబడ్డాడు. ఏపీకి చెందిన చెందిన మునియ్య అశ్వారావుపేటలో ఓ బైక్‌ను దొంగిలించుకొని వెళ్తుండగా అనుమానా స్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నట్లు అశ్వారావుపేట సీఐ కరుణాకర్ తెలిపారు. విచారించగా ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో ఎనిమిది బైక్‌లను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. ఇప్పటి వరకు నిందితుడిపై 61 కేసులు ఉండగా.. గతంలో రాజమండ్రి జైలు లో శిక్ష అనుభవించి, వచ్చాడని తెలిపారు. నిందితుడిని కోర్డులో హాజరు పరిచినట్లు సీఐ కరుణాకర్, ఎస్సై యాతతి రాజు వెల్లడించారు.