29-03-2025 12:47:39 AM
- నలుగురు యువకుల అరెస్టు, 9 బైకులు స్వాధీనం
రాజేంద్రనగర్, మార్చి 28 (విజయక్రాంతి): నిబంధనలకు విరుద్ధంగా, అడ్డగోలుగా బైకులతో విన్యాసాలు చేస్తుండగా పోలీసులు కొరడా ఝలిపించారు. రాజేంద్రనగర్ లోని పిల్లర్ నెంబర్ 22 వద్ద రాజేంద్రనగర్ ఏసీపి తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నలుగురు యువకులు విన్యాసాలు చేస్తుండగా వారిని పట్టుకున్నా రు. అదేవిధంగా 9 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ అత్తాపూర్ ఇన్స్పెక్టర్లు క్యాస్ట్రో నాగేశ్వరరావు, అదేవిధంగా రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బైకులతో అడ్డగోలుగా విన్యాసాలు చేసే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు..