09-03-2025 04:45:32 PM
కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): బీసీల ఐక్యతకు బైక్ ర్యాలీ నిర్వహించినట్లు భూపాలపల్లి జిల్లా తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షులు రవి పటేల్ అన్నారు. బీసీలలో ఐక్యత తీసుకురావడంతో పాటు రాజ్యాధికారం చేపట్టే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీ అభ్యర్థులు రాజకీయాలకు అతీతంగా తమ సత్తాను చూపెట్టారని ప్రస్తావించారు. గడపగడపకు బీసీ నినాదం తీసుకెళ్లే ఉద్దేశంతో బైక్ ర్యాలీ నిర్వహించి, బీసీ సంఘాలను జాగృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు మండలాల అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు, ఆయా గ్రామాల కార్యకర్తలు, తీన్మార్ మల్లన్న టీం సభ్యులు పాల్గొన్నారు.