calender_icon.png 21 October, 2024 | 3:02 AM

ఐటీ కారిడార్ రోడ్లపై బైక్ రేసింగ్

21-10-2024 12:34:53 AM

ఆరుగురి అరెస్ట్ 

శేరిలింగంపల్లి, అక్టోబర్ 20: రాయదుర్గంలోని ఐటీ కారిడార్ రోడ్లపై యువకులు బైక్ రేసింగ్ చేస్తూ రెచ్చిపోతున్నారు. ఆదివారం రాత్రి టీ హబ్, నాలెడ్జ్ సిటీ ప్రాంతాల్లో  బైక్ రేసింగ్ చేస్తూ రోడ్డుపై వెళ్లే సామాన్యులను భయబ్రాంతులకు గురిచేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న బైక్ రేసింగ్‌లపై పోలీసులకు సమాచారం అందడంతో ఆరుగురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు రాయదుర్గం పోలీసు లు తెలిపారు. వారి నుంచి 10 బైక్‌లు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.