ఒకరి దుర్మరణం, మరొకరికి గాయాలు
రాజేంద్రనగర్, డిసెంబర్28: నార్సింగి పీఎస్ పరిధిలో ఔటర్ సర్వీస్‌రోడ్డుపై బైక్ కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ మునీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. కిస్మత్‌పూర్‌కు చెందిన సాత్విక్, నిషాల్క్ కోకాపేటలోని ఎక్సలెన్సియా కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. శనివారం వీరిద్దరు కిస్మిత్‌పూర్ నుంచి కోకాపే తమ కాలేజీకి బైకుపై వెళ్తుండగా నార్సింగి పరిధి ఔటర్ సర్వీస్‌రోడ్డు సమీపంలోఅదుపుతప్పి రోడ్డుపై ఉన్న కరెంట్ పోల్‌ను బైకు ఢీకొంది. ప్రమాదంలో సాత్విక్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. నిషాల్క్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.