calender_icon.png 21 April, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగిఉన్న లారీని ఢీకొట్టిన బైక్

11-12-2024 12:55:24 AM

ఇద్దరు యువకుల దుర్మరణం

నిజామాబాద్, డిసెంబర్ 10 (విజ యక్రాంతి): నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. నిజామాబాద్‌కు చెందిన సందీప్ (21), ప్రమోద్ (22) ద్విచక్ర వాహనంపై ఆర్మూరు నుంచి డిచ్‌పల్లి మీదుగా నిజామాబాద్‌కు బయలుదేరారు.

ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వీరు సికింద్రాపూర్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కడ మృతి చెందారు.