19-04-2025 06:37:49 PM
ఒకరు మృతి...
బూర్గంపాడు (విజయక్రాంతి): ఎద్దుల బండిని వెనకనుంచి బైక్ ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన శనివారం బూర్గంపాడు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని ఏలూరు జిల్లా కుకునూరు మండలం సీతారామ నగరం గ్రామానికి చెందిన కొమ్ము నాగేశ్వరరావు, రాజేశ్వరి దంపతులు సారపాక నుండి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా బూర్గంపాడు కొల్లు చెరువు వద్ద ఎద్దుల బండిని వెనకనుంచి ఢీకొట్టడంతో నాగేశ్వరరావు తీవ్రగాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన నాగేశ్వరావును భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుని భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు బూర్గంపాడు ఎస్సై రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.