కామారెడ్డి, డిసెంబర్ 6 (విజయక్రాంతి): మెదక్ జిల్లా పోచమ్మ తండాకు చెందిన విఠల్(46) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో సెంట్రింగ్ పనులు నిర్వహిస్తున్నాడు. పనుల నిమిత్తం దేవిసింగ్‌తో కలిసి బైక్‌పై శుక్రవారం ఎల్లారెడ్డికి వెళ్తుండగా ఆగి ఉన్న ఆటోను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో విఠల్ మృతిచెందగా బైక్‌పై వెనుక కూర్చున్న దేవి సింగ్‌కు గాయాలయ్యాయి.