మెదక్ జిల్లా పోచమ్మ తండాకు చెందిన విట్టల్ గా గుర్తింపు
కామారెడ్డి (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని లక్ష్మీ థియేటర్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పట్టణ ఎస్సై మహేష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా పోచమ్మ తండాకు చెందిన ఎల్లారెడ్డి మండలంలో సెంట్రింగ్ పనులు నిర్వహిస్తున్నాడు. పనుల నిమిత్తం దేవి సింగ్ తో కలిసి ఎల్లారెడ్డికి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వస్తున్న విట్టల్ ఆగి ఉన్న ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విట్టల్ (46) మృతి చెందగా బైకుపై వెనుక కూర్చున్న దేవి సింగ్ కు గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.