calender_icon.png 9 January, 2025 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజాపూర్ హైవేను ఏడాదిలోగా పూర్తిచేస్తాం

09-01-2025 01:48:39 AM

ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

చేవెళ్ల, జనవరి 8: బీజాపూర్ హైవేలో పెండింగ్‌లో ఉన్న 46.5 కిలోమీటర్ల రోడ్డును ఏడాదిలోగా పూర్తిచేస్తామని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. మర్రి చెట్ల విషయంలో కొందరు ఎన్‌జీటీకి వెళ్లడంతో జాప్యం జరిగిందని, తాను మంత్రి అయ్యాకే ఫారెస్ట్ వాళ్లతో మాట్లాడి మర్రిచెట్లు మరో దగ్గర పెట్టించేందుకు మిషనరీలు తీసుకొచ్చామని చెప్పారు.

బుధవారం చేవెళ్ల మండలం కేంద్రంలతో పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి సొంత నిధులు రూ.40 లక్షలతో నిర్మించిన పీఏసీఎస్ భవనం, గోడౌన్‌ను ప్రారంభించారు. అనంతరం ముడిమ్యాల నుంచి మేడిపల్లి వరకు 8.2 కిలోమీటర్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వారం పది రోజుల్లోనే ఈ రోడ్డు పనులు స్పీడప్ చేస్తామని, తానే పది రోజులకోసారి వచ్చి స్వయంగా పర్యవేక్షణ చేస్తానని మాటిచ్చారు. రంగారెడ్డి జిల్లా రోడ్లకు వెయ్యి కోట్లయినా ముఖ్యమంత్రిని ఒప్పించి మంజూరు చేయిస్తానని మాటిచ్చారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి భోళా శంకరుడని, ఏమడిగినా కాదనకుండా ఇస్తారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొనియాడారు. ఇప్పటికే రూ.150 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.