calender_icon.png 23 February, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దారిదోపిడీ బిహారి ముఠా అరెస్ట్

22-02-2025 01:24:10 AM

నిజామాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో దారి దోపిడీకి  పాల్పడిన బిహారీ ముఠాను అరెస్ట్ చేసినట్లు సౌత్ రూరల్ సీఐ సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీహార్ కు చెందిన కుందన్ విజయ్ సుందర్ గం నగర శివారులో అమలులో పనిచేస్తూ జీవిస్తున్నారని ఆయన తెలిపారు.

మద్యానికి బానిసైన వీరు డబ్బుల కోసం దారిని దోపిడీలు చేయాలని నిర్ణయించుకొని పథకం ప్రకారం ఈనెల 19న అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ నుంచి వర్నివైపు వెళుతున్న జితేష్ ను అడ్డగించాలని అనంతరం అతన్ని చితకబాది అతని వద్దనున్న నగదు వెయ్యి రూపాయలను సెల్ఫోన్ కెమెరాను లాక్కొని పారిపోయారని సురేష్ తెలిపారు బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని సిఐ సురేష్ తెలిపారు.