హైదరాబాద్: రాజేంద్రనగర్ లో చోరీకి పాల్పడిన బిహార్ కు చెందిన దంపతులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నాంపల్లి రైల్వే స్టేషన్ లో రాజేంద్రనగర్ పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. చోరీ చేసి ఆభరణాలతో బిహార్ కు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులు వద్ద నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బిహార్ వాసులు ఓ వైద్యుడి ఇంట్లో పనికి చేరి బంగారం చోరీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు.