calender_icon.png 1 February, 2025 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్ కాంగ్రెస్ ఎంపీపై గ్రామస్థుల దాడి

01-02-2025 12:49:38 AM

పాట్నా, జనవరి 31: బీహార్‌లోని కైమూర్ జిల్లా నాథుపుర్ గ్రామస్థులు ఓ ఎంపీపై దాడి చేశారు. దాడి కారణంగా ఎంపీ గాయాలపాలయ్యారు. కాంగ్రెస్ ఎంపీ మనోజ్‌కుమార్ శుక్రవారం నాథుపుర్‌లో జరిగిన ఊరేగింపు వేడుకకు హాజరయ్యారు. ఎంపీ గ్రామ సందర్శనకు వెళ్లగా, తర్వాత డ్రైవర్ కారు నడుపుతున్నాడు. ఈ క్రమంలో కారు కొందరు గ్రామస్థులను తాకుతూ వెళ్లింది. దీంతో గ్రామస్థులు ఎదురు తిరిగారు.

ఎంపీ అనుచరులు ప్రతిదాడికి దిగుతుండగా, ఎంపీ అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో గ్రామస్తులు కర్రలు, రాడ్లతో ఎంపీతో పాటు ఆయన అనుచరులపై దాడి చేశారు. ఘటనలో ఎంపీ తలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎంపీని వారణాసిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. దాడి ఘటనపై గ్రామస్థులను విచారిస్తున్నారు.