calender_icon.png 17 January, 2025 | 11:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీపీఎస్సీని సందర్శించిన బీహార్ కమిషన్

17-01-2025 12:56:13 AM

హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): టీజీపీఎస్సీని బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు గురువారం సందర్శించారు. ఈమేరకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంతో బీహార్ కమిషన్ సభ్యులు సర్బ్ నారాయణ్ యాదవ్, నవల్ కిశోర్, ప్రొఫెసర్ అరుణ్‌కుమార్ భగత్ సమావేశమయ్యారు.

ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రం అమలు చేస్తున్న విధానాలను వారికి వివరించారు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ)లో పరీక్షలు నిర్వహించడాన్ని వారు ప్రశంసించారు. ఉద్యోగ నియామకాల్లో తలెత్తే న్యాయపరమైన చిక్కులపై సైతం ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించారు.