calender_icon.png 22 March, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు పెద్దపీట

20-03-2025 02:17:48 AM

కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో రైతులకు పెద్ద పీట వేసింది. రైతుల రుణ మాఫీ కోసం రూ. 20,616 కోట్లు కేటాయించడంతోపాటు రైతు భరోసా కింద ఎకరాకు రూ. 12,000 చెల్లించేందుకు బడ్జెట్ రూ. 18000 కోట్లు కేటాయించడం అభినందనీయం.

ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు సన్న ధాన్యానికి క్వింటాల్ కు రూ. 500 బోనస్ ఇచ్చేందుకు వడ్ల బోనస్ కింద రూ. 1206 కోట్ల చెల్లించేందుకు డబ్బులు కేటాయించడంతోపాటు రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాల సంఖ్యను 8,332కు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం హర్షనియం. అంతేకాకుండా అయిల్ ఫామ్ సాగుకు టన్నుకు రూ.2000 సబ్సిడీ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం, పంటల సాగు కోసం తీసుకుంటున్న నిర్ణయాలు రైతులకు ఎంతో ఉపయోగపడనున్నాయి.

  పంచర్పుల వెంకటేష్