calender_icon.png 23 January, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగాల్ టైగర్స్ ఘన విజయం

22-01-2025 11:33:35 PM

హాకీ ఇండియా లీగ్...

రాంచీ: మహిళల హాకీ ఇండియా లీగ్‌లో బెంగాల్ టైగర్స్ విజయాన్ని అందుకుంది. లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ 2 ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్‌పై గెలుపొందింది. బెంగాల్ తరఫున ముల్లన్ (ఆట 21వ, 33వ ని.లో) గోల్స్ సాధించింది. ఈ విజయంతో బెంగాల్ టైగర్స్ ఖాతాలో ఏడు పాయింట్లు ఉండగా.. సుర్మా క్లబ్, ఒడిశా వారియర్స్ తర్వాతి స్థానంలో ఉంది. పురుషుల హాకీ విభాగంలో హర్మన్‌ప్రీత్ సారధ్యంలోని సుర్మా హాకీ క్లబ్ మరో విజయాన్ని అందుకుంది. ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్‌ను 1 సుర్మా క్లబ్ మట్టికరిపించింది. సుర్మా తరఫున హర్జీత్ సింగ్ (9వ ని.లో), గుర్జంత్ సింగ్ (17వ ని.లో) గోల్స్ అందించారు. ఢిల్లీ తరఫున కోరే వేయర్ (59వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు. నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో మహిళల విభాగంలో ఒడిశా వారియర్స్‌తో ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్, పురుషుల విభాగంలో తమిళనాడు డ్రాగన్స్‌తో హైదరాబాద్ తుఫాన్స్ తలపడనున్నాయి.