లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయి అరెస్ట్..
కోకపేట వద్ద అదుపులోకి తీసుకున్న నార్సింగి పోలీసులు ..
సుమారు 300 మంది అమ్మాయిల ప్రైవేటు వీడియోలు మస్తాన్ సాయి వద్ద ఉన్నట్లు ఆరోపణలు
రాజేంద్రనగర్: లావణ్య- రాజ్ తరుణ్ కేసు(Lavanya-Raj Tarun case)లో బిగ్ ట్విస్ట్ చేసుకుంది. యువ హీరో రాజ్ తరుణ్(hero Raj Tarun) మాజీ ప్రేయసి లావణ్య ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతడిని కోకాపేట వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతడు పలువురు అమ్మాయిలతో ప్రైవేట్ గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సన్నిహితంగా గడిపిన వీడియోలతో అతడు బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
అయితే లావణ్యకు చెందిన కొన్ని వీడియోలను కూడా మస్తాన్ సాయి(Mastan Sai) రికార్డ్ చేశాడు. సదరు వీడియోలను లావణ్య పోలీసులకు అందజేసింది. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో సుమారు 300 మంది అమ్మాయిల వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో డ్రగ్స్ కేసులో పోలీసులు మస్తాన్ సాయితో పాటు లావణ్యను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు గతంలో అతడిని ఏపీ పోలీసులు కూడా అరెస్టు చేశారు. అయితే రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి మస్తాన్ సాయినే ప్రధాన కారణమని లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. అతడు కొందరు సెలబ్రిటీల ఫోన్లను కూడా హ్యాక్ చేశాడని ఆరోపణలు చేసింది.
హీరో నిఖిల్ ఫోన్ హ్యాక్..
మస్తాన్ సాయి టాలీవుడ్ హీరో నిఖిల్(Tollywood hero Nikhil) ఫోన్ ను కూడా గతంలో హ్యాక్ చేసినట్లు సమాచారం. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో నిఖిల్ తో పాటు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ కు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు సమాచారం. అతడి వద్ద సుమారు 300 మంది అమ్మాయిలకు సంబంధించి నగ్న వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ ను లావణ్య పోలీసులకు అందజేసింది. అతడు తనపై అత్యాచారం కూడా చేశాడని హార్ట్ డిస్క్ ఇవ్వనందున తనను చంపబోయాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది.