calender_icon.png 12 February, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంతెమ్మగుట్టలో పెద్దపులి

11-02-2025 01:38:11 AM

బెల్లంపల్లి, ఫిబ్రవరి 10: బెల్లంపల్లి అటవీరేంజ్ పరిధిలోని కన్నాల-బుగ్గ అడవుల్లో 12 రోజులు సంచరించిన పెద్దపులి ఆదివారం అంకుశం అటవీప్రాంతం మీదుగా తాండూర్ మండలం మాదారం వైపు వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. సోమవారం సాయంత్రం మాదారం పరిసరాల్లోని మంతెమ్మగుట్ట అడవుల్లో పెద్దపులి పాదముద్రలను గుర్తించారు.

తాండూర్ మండల కేంద్రానికి సమీపంలోని రేపల్లెవాడ, పెగడపల్లి ప్రాంతాల్లోనూ పెద్దపులి కదలికలను పసిగట్టినట్లు వెల్లడించారు. మం డలంలోని రేపల్లెవాడ సమీపంలోని ఒక యువకునికి పులి గాండ్రింపులు వినిపించినట్లు తెలుస్తోంది. మంతెమ్మ గుట్ట ప్రాంతానికి వచ్చిన పెద్దపులి తిర్యాణి అడవుల వైపు వె ళ్లిందా?

లేక రేపల్లెవాడ మీదుగా రెబ్బెన మండలంలోని పులికుంట వైపుకు వెళ్లి ఉంటుందా అనే కోణంలో పరిశీలిస్తున్నట్లు మాదారం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ తిరుపతి తెలిపారు. మాదారం, రేపల్లెవాడ, పెగడపల్లి, పు లికుంట గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపరులు అడవిలోకి వెళ్లవద్దని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.