calender_icon.png 1 February, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్

01-02-2025 12:44:40 AM

ఎన్నికల ముంగిట పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా

న్యూఢిల్లీ, జనవరి 31: ఎన్నికల ముంగిట ఆమ్‌ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఏడు గురు ఎమ్మెల్యేలు శుక్రవారం రాజీనామా చేశారు. కేజ్రీవాల్‌తోపాటు పార్టీపై నమ్మకం పోయిందనీ అందుకే రాజీనామా చేస్తున్న ట్టు పాలం ఎమ్మెల్యే భావనా గౌర్, మదన్‌లాల్ వెల్లడించారు.

రాజీనామా చేసిన వారి లో భావనా గౌర్, మదన్ లాల్, రోహిత్ మోహ్రౌలియా, రాకేశ్ రిషి, నరేశ్ యాదవ్, పవన్ శర్మ, బీస్ జూన్ ఉన్నారు. తమ రాజీమానా లేఖలను ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాం నివాస్ గోయెల్‌కు పంపినట్టు మదన్‌లాల్ పేర్కొన్నారు. కాగా రాజీనామా చేసిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఆరుగురికి ఈసారి ఎన్నికల్లో టికెట్ దక్కలేదు.