calender_icon.png 17 January, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్

18-12-2024 01:34:28 AM

  • హష్‌మనీ కేసులో ఎదురుదెబ్బ
  • అభియోగాల కొట్టివేతకు కోర్టు తిరస్కరణ

న్యూయార్క్, డిసెంబర్ 17: రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్‌నకు హష్‌మనీ కేసులో ఎదురుదెబ్బ తగిలింది. పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియ ల్స్‌కు అనధికారికంగా డబ్బులు చెల్లి ంచిన హష్‌మనీ కేసులో ట్రంప్‌పై నమోదైన అభియోగాలను కొట్టివేసేందుకు న్యూయార్క్ కోర్టు తిర స్కరించింది. అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే రక్షణ ఉంటుందని, ఇలాంటి అనధికార ప్రవర్తన విషయంలో ట్రంప్ నకు రక్షణ వర్తించదని మన్‌హట్టన్ న్యాయమూర్తి జువాన్ మర్చన్  స్పష్టం చేశారు.

కాగా హష్ మనీ కేసులో ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలారు. అయితే ఆయన అధ్యక్షుడిగా ఎన్నికవడంతో క్రిమినల్  విచా రణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.  మీక్రమంలో కేసు నుంచి తనకు ఉపశమనం కల్పించాలని న్యూయార్క్ కోర్టును ట్రంప్ కోరా రు.  విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.