- బీజేపీలో చేరిన ముగ్గురు కౌన్సిలర్లు
- ఆదిలాబాద్ మున్సిపల్లో తగ్గిన బీఆర్ఎస్ బలం
ఆదిలాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): ఆదిలాబాద్లో ఇప్పటికే డీలాపడుతూ వస్తున్న గులాబీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇదివరకే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీలోకి వలసలు కొనసాగుతున్న తరుణ ంలో తాజాగా మరో ముగ్గురు కౌన్సిలర్లు బీ జేపీ తీర్థం పుచ్చుకొన్నారు. శుక్రవారం అదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు స ంజయ్, నెమలికొండ విషు, భరత్కుమా ర్.. ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమక్షంలో బీజేపీ లో చేరారు.
వీరికి సాదరంగా పార్టీలోకి ఆహానించి బీజేపీ కండువాలు కప్పారు. బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత, ప్రధాని మోదీ నాయకతంలో పెరిగిన జనాధారణతోపాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధర్యంలో పట్టణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బీజేపీలో చేరడం జరిగిందని కౌన్సిలర్లు తెలిపారు. వీరి వెంట 150 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కండువా కప్పుకొన్నారు.