calender_icon.png 23 October, 2024 | 8:55 PM

జగిత్యాలలో బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్

05-05-2024 12:34:48 AM

కేసీఆర్ రోడ్ షోకు ముందే పలువురు కౌన్సిలర్ల రాజీనామా

జగిత్యాల, మే4(విజయక్రాంతి): జగిత్యాలలో బీఆర్‌ఎస్‌కు బిగ్‌షాక్ తగిలింది. ఎమ్మెల్యే సంజయ్ తీరుకు అసంతృప్తి చెంది బీఆర్‌ఎస్‌కు చెందిన కౌన్సిలర్లు రేణుక మొగిలి, సిరికొండ పద్మ, సిరికొండ భారతి, బండారి రజని, దాసరి లావణ్య, అల్లు గంగాసాగర్ శనివారం పార్టీ అధినేత కేసీఆర్ రోడ్ షో కొన్ని గంటల ముందు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ వీడడం తమకు చాలా బాధగా ఉందని, కానీ ఎమ్మెల్యే చెప్పుడు మాటలు విని తమను దూరం పెట్టారన్నారు. పార్టీ కోసం సేవ చేసినా తమకు సముచితమైన గౌరవం దక్కలేదన్నారు. తమ భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కాగా మున్సిపల్ చైర్‌పర్సన్ అవిశ్వాస ఎన్నికలో రెబల్ అభ్యర్థికి మద్దతు ఇచ్చినందుకు రాజీనామా చేసిన కౌన్సిలర్లకు విప్ జారీ చేసినట్లు బీఆర్‌ఎస్ అధిష్ఠానం ప్రకటించింది.