పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కీలక నేతలు.
సందిగ్ధంలో బిఆర్ఎస్ పార్టీ..
రామయంపేట, (విజయ క్రాంతి): బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. రామయంపేట మాజీ జెడ్పిటిసి, ఏఎంసి మాజీ చైర్మన్ కీలక నేత సరాప్ యాదగిరి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు, చింతల యాదగిరి పార్టీకి రాజీనా చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అలాగే తొందర్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. పట్టణంలో కీలక నేతలుగా పేరుపొందిన ఈ ముగ్గురు పార్టీ మారితే పట్టణంలో బిఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమే. ఈ నేతల రాజీనామా పట్ల అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో అని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.