ముల్తాన్: ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. ఓపెనర్ క్రాలీ (64*), రూట్ (32*) క్రీజులో ఉన్నాడు. అంతకముందు పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలి రోజు ఆటలో ఇద్దరు పాక్ బ్యాటర్లు సెంచరీలు చేయగా.. రెండో రోజు అగా సల్మాన్ (104 నాటౌట్) శతకంతో దుమ్మురేపాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 3 వికెట్లు పడగొట్టగా.. అకిన్‌సన్, కార్సె చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ బజ్‌బాల్ ఆటను కొనసాగించింది. కెప్టెన్ ఒలీ పోప్ రూపంలో తొలి వికెట్ తొందరగా కోల్పోయినప్పటికీ ఇంగ్లండ్ ధాటిగా ఆడింది. మూడో రోజు ఆటలో పాక్ బౌలర్ల ప్రదర్శనపై ఇంగ్లండ్ ఆట ఆధారపడి ఉంది.