26-03-2025 01:50:26 AM
హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ చేపట్టిన ‘మన ఊరు బడి’లో భాగంగా చేసిన బెంచీల కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగాయని, ఇది కాళేశ్వరం కన్నా పెద్దస్కామ్ అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీలో విద్యాశాఖ, టూరిజం, ఎక్సైజ్ శాఖల పద్దుపై ఆయన మాట్లాడారు..
బీఆర్‌ఎస్ హయాంలో రూ.4వేల నుంచి రూ.5వేలకు కొనుగోలు చేయాల్సిన బెంచీలను రూ.15వేల నుంచి రూ.20వేలకు కొనుగోలు చేశారని ఆరోపించారు. దాదాపు 32లక్షల బెంచీల వరకు కొనుగోలు చేశారన్నారు. దీనిపై విచారణ జరిపించాలని కోరారు. అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్స్‌కు రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు స్పందిస్తూ..
అది ఓల్డ్‌సిటీ మాత్రమే కాదని, ఒరిజినల్ సిటీ అని అన్నారు. పాతబస్తీ ప్రజలంటే తమకు అమితమైన గౌరవమని, కొన్ని సంవత్సరాల తర్వాత ఓల్డ్ సిటీ ఎలా ఉంటుందో మీరే చూస్తారని అక్బరుద్దీన్ ఓవైసీని ఉద్దేశించి పేర్కొన్నారు.