calender_icon.png 6 November, 2024 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూపీ మదర్సాలకు భారీ ఊరట

06-11-2024 01:11:56 AM

అక్కడ మదర్సా చట్టం రాజ్యాంగబద్ధమే

తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, నవంబర్ 5: ఉత్తరప్రదేశ్ మద ర్సా ఎడ్యుకేషన్ చట్టం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చిం ది. దీంతో ఆ రాష్ట్రంలో  వేల సంఖ్యలో ఉన్న మదర్సాలకు భారీ ఊరట లభించింది.  కాగా యూపీ మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. సెక్యులర్ భావనకు విరుద్ధమైనదిగా పేర్కొంటూ మద ర్సా చట్టాన్ని రద్దు చేసింది.

దీంతో దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా మంగళవారం పిటిషన్‌పై సుప్రీం విచారణ జరిపి హైకోర్టు తీర్పును కొట్టివేసింది. హైకోర్టు తీర్పు 10 వేల మంది మదర్సా టీచర్లు, 17 లక్షల మంది విద్యార్థుల పైనా ప్రభావం చూపుతోందని అప్పట్లో పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుతో 16 వేల మదర్సాలు యథావిధిగా నడువనున్నాయి.