19-02-2025 04:42:32 PM
కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు భారీ ఊరట
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Karnataka Chief Minister Siddaramaiah)కు భారీ ఊరట లభించింది. ముడా కుంభకోణంలో సిద్ధరామయ్యకు లోకాయుక్త బుధవారం క్లీన్ చిట్ ఇచ్చింది. మైసూరు అర్భన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారని కర్నాటక సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి తదితరులపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
కర్ణాటక లోకాయుక్త పోలీసులు(karnataka lokayukta police) బుధవారం మాట్లాడుతూ... ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్య, ముడా కేసులో ప్రమేయం ఉన్న ఇతరులపై "ఎటువంటి ఆధారాలు" లభించలేదని తెలిపారు. ముడా కేసు 2021లో బిజెపి అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్యకు పరిహారంగా ముడా కేటాయించిన రూ.56 కోట్ల విలువైన 14 స్థలాల కేటాయించినట్లు ఆరోపణలున్నాయి. 2010లో సిద్ధరామయ్య భార్యకు ఆమె సోదరుడు బహుమతిగా ఇచ్చిన సుమారు 3.16 ఎకరాల భూమిని 2014లో ముడా "తప్పుగా" స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ ఘటన జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన భార్యకు ముడా 14 ఇళ్ల స్థలాల కేటాయింపులో తన వైపు నుండి ఎటువంటి తప్పు లేదా అవినీతి జరగలేదని బహిరంగంగా వాదించారు.