calender_icon.png 5 February, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెనడాకు బిగ్ రిలీఫ్

05-02-2025 12:56:20 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4:కెనడా దిగుమతులపై 25శాతం అదనపు సుంకాలు విధిస్తూ జారీ చేసిన ఆదేశాలను అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేశారు. తమ దేశానికి చెందిన దిగుమతులపై విధించిన అదనపు సుంకాల విధింపు ఆదేశాలను 30 రోజులపాటు అమెరికా నిలిపివేసిందని కెనడా ప్రధాని ట్రూడో సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ట్రంప్‌తో ఫోన్ సంభాషణ సందర్భంగా అమెరికా సరిహద్దుల వెంట భద్రతను కట్టుదిట్టం చేసేందుకు హామీ ఇవ్వడంతో టారిఫ్‌ల అమలును నెల రోజులపాటు నిలిపివేసినట్టు వెల్లడించారు. సరిహద్దుల భద్రత కోసం 1.3 బిలియన్ డాలర్ల ప్రణాళికను అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

అమెరికన్ బలగాల భాగస్వా మ్యం తో సరిహద్దుల్లో కొత్త సాంకేతికను అమలు చేయడంతోపాటు అదనపు సిబ్బం దిని, కొత్త చాపర్లను మోహరించనున్నట్టు చెప్పారు. ఫెంటానిల్ రవాణాను ఆపేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు.

సరిహద్దు భద్రత విషయంలో కలిసి పనిచేసే వరకు ప్రతిపా దించిన టారిఫ్‌లను కనీసం 30 రోజులపాటు నిలిపివేసేందుకు అంగీకారం కుది రినట్టు వివరించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ట్రంప్ కూడా ధ్రువీకరించారు.

కెనడాతో తుది ఆర్థిక ఒప్పందాన్ని రూపొందించవచ్చో లేదో చూడటానికి శనివారం ప్రతిపాదించిన సుంకాలను 30రోజులపాటు నిలిపి వేస్తున్నట్టు ప్రకటించారు.

అంతకుముందు అమె రికాలోకి అక్రమ మాదక ద్రవ్యాలు ప్రవేశించకుండా చర్యలు తీసుకు ంటామని మెక్సికో హామీ ఇవ్వడంతో ఆ దేశంపై విధించిన టారిఫ్‌లను కూడా ట్రంప్ నెల రోజులపాటు నిలిపివేశారు.