* బినామీ ఆస్తుల ఆరోపణలను కొట్టేసిన ట్రిబ్యునల్
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే అజిత్ పవార్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. అజిత్ పవార్, ఆయన కుటుంబ సభ్యులు బినామీ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలను ఆదాయ పన్నుశాఖకు చెందిన బినామీ ఆస్తుల లావాదేవీల నిరోధక ట్రిబ్యునల్ కొట్టేసింది. దీంతో గతంలో సీజ్ చేసిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను ఆదాయపన్నుశాఖ తాజాగా క్లియర్ చేసింది. దీనిపై పవార్ స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఆరోపణలను అంగీకరించాల్సిన అవసరం లేదనీ అప్పీల్ చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని పేర్కొన్నారు. కాగా, అజిత్ పవార్ భారీ మొత్తంలో బినామీ ఆస్తులు కలిగి ఉన్నారని పేర్కొంటూ ఐటీ అధికారులు 2021 అక్టోబర్‌లో ఆయనకు చెందిన సుమారు రూ.1000కోట్ల ఆస్తులను సీజ్ చేసిన విషయం తెలిసిందే.