calender_icon.png 10 January, 2025 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బియ్యం తరలింపు వెనుక పెద్ద మాఫియా

03-12-2024 03:14:45 AM

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల

విజయవాడ, డిసెంబర్ 2: రేషన్ బియ్యం విదేశాలకు అక్రమ తరలింపు వెనుక చాలా పెద్ద మాఫియా హస్తం ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇది జాతీయస్థాయి కుంభకోణమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సోమవారం ప్రకటనను విడుదల చేశారు.

‘పేదల పొట్టకొట్టి రూ.48 వేల కోట్ల ప్రజల డబ్బును పందికొక్కులా మెక్కారు. బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉంది. ఈ వ్యవహారంలో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అధికారుల హస్తముంది. ఎవరి వాటా లు వారికి అందడంతో అంతా మిన్నకున్నారు.

గడిచిన మూడేళ్లలో రాష్ట్రం లోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా తరలడాన్ని బట్టి.. నిఘా వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు’ షర్మిల పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దలకు బియ్యం మాఫియాతో సంబం ధాలు ఉన్నాయా? లేక మిల్లర్లు చేతి వాటం ప్రదర్శించారా? అని ప్రశ్నించారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవా ణాపై రాష్ట్ర ప్రభుత్వం సిట్‌తో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.