01-04-2025 02:23:33 AM
స్టార్ హీరో రామ్‌చరణ్ కథానాయకుడిగా రూపొందుతున్న మరో చిత్రం ‘పెద్ది’. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్ సరసన జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతిబాబు, కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందుశర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మేకర్స్ మరో అప్‌డేట్‌ను ఇచ్చారు. ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నట్టు పేర్కొన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6న ‘ఫస్ట్ షాట్’ పేరుతో ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ మేరకు గ్లింప్స్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు. క్రీడా మైదానంలోకి డైనమిక్‌గా దూకుతున్న రామ్‌చరణ్‌ను ఈ పోస్టర్‌లో చూడొచ్చు. ఈ పోస్టర్‌తో గ్లింప్స్ ఎలా ఉండబోతుందోనని అందరిలో ఆసక్తి మరింత పెరిగింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు; సంగీత దర్శకుడు: ఏఆర్ రెహమాన్.