న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు తాను వీరాభిమానినని హాకీ దిగ్గజ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ పేర్కొన్నాడు. శ్రీజేశ్ మాట్లాడుతూ.. ‘ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్ కావాలనుకున్నా. అందుకు తగ్గట్లే జూనియర్ హాకీ జట్టుకు కోచ్‌గా పనిచేయనున్నా. అయితే రిటైర్మెంట్ అనంతరం ఫ్యామిలీకి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ నా లక్ష్యమేంటో కుటుంబానికి వివరించిన తర్వాత అర్థం చేసుకున్నారు.
కోచ్‌గా పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నా. టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అంటే చాలా అభిమానం. ముఖ్యంగా ఒక జూనియర్ కోచ్‌గా ఆటగాళ్లను అతడు తీర్చిదిద్దిన విధానం అద్భుతం. ఇప్పుడు కోచ్‌గా ద్రవిడ్ బాటలోనే నడవాలనుకుంటున్నా. 2028 వరకు దాదాపు 20 నుంచి 40 మంది ఆటగాళ్లను తయారు చేస్తానేమో. జాతీయ జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపికవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నా’ అని శ్రీజేశ్ చెప్పుకొచ్చాడు.