న్యూఢిల్లీ, నవంబర్ 9: ఏషియన్ పెయింట్స్ కన్సాలిడేటెడ్ నికరలాభం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో భారీగా 42 శాతం తగ్గి రూ. 694 కోట్లకు పడిపోయింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ. 1,205 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాన్ని ఆర్జించింది. కంపెనీ అమ్మకాల ఆదాయం కూడా 5.3 శాతం క్షీణించి రూ 8,452 కోట్ల నుంచి రూ. 8,003 కోట్లకు తగ్గింది. ఈ క్యూ2లో పెయిం ట్స్ పరిశ్రమ డిమాండ్ సన్నగిల్లిందని, తమ డెకొరేటివ్ కోటింగ్స్ అమ్మ కాలు 5.5 శాతం తగ్గాయని ఏషియన్ పెయింట్స్ శనివారం తెలిపింది.