సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య....
సంగారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు రావాల్సిన అవసరముందని, ఆ దిశగా సంగారెడ్డిలో జరగబోయే సీపీఐఎం రాష్ట్ర 4వ మహాసభల్లో సమరశీల పోరాట కర్తవ్యాలను రూపొందించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో ఉన్న కేవల్ కిషన్ భవన్‌లో నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు, జ్యోతితో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వీరయ్య మాట్లాడారు. బీఆర్‌ఎస్ తొమ్మిదిన్నరేళ్లు, బీజేపీ పదేళ్లు, కాంగ్రెస్ 13 నెలల పాలలు పాలించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఓటర్లుగా మాత్రమే చూశాయని ఏనాడూ వారిని ప్రజలుగా గ్నుర్తించలేదన్నారు. ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చేందుకు దోహదపడే ఏ ఒక్క మంచి నిర్ణయం, పథకాలు అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న కోటీ 30 లక్షల మంది కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.
కేంద్రంలోని ప్రధానమంత్రి మోడీ మాత్రం రోజుకు రూ.178 రూపాయల వేతనం సరిపోతుందంటూ జీవో జారీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఏలాంటి ఆర్థిక భారం పడకపోయినా కార్పొరేట్లు, పెట్టుబడిదారుల లాభాల కోసం కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడానికి ఇష్టపడట్లేదన్నారు. ఎన్నికల ముందు కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు పైసా సాయం చేయలేదన్నారు. కౌలు రైతులకు కనీసం గ్నుర్తింపు కార్డుల్ని కూడా ఇవ్వట్లేదన్నారు. గ్రామీణ పేదలకు వంద రోజుల పని దినాలు గ్యారంటీ చూపడంలోనూ వైఫల్యముందన్నారు. ధరలు ఆకాశనంటినా ప్రభుత్వాలకు పట్టించులేదన్నారు. రాష్ట్రంలో లక్ష కుటుంబాలు సొంతిళ్లులేక గుడిసెలేసుకుని పోరాడితే వారికి స్థలం, ఇండ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు అంటూ రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇండ్లంటూ కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేయడం తప్ప ఏ ఒక్క పేదకు ఇళ్లు కట్టించిన పాపాన పోలేదన్నారు. విద్య, వైద్యం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లడం వల్ల పేద, మద్యతరగతి ప్రజలకు అవి అందని ద్రాక్షలా మారాయన్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో 3 లక్షల వరకు ఉద్యోగాల ఖాళీలున్నాయని, జాబ్ క్యాలెండర్ మొక్కుబడిగా తప్ప చిత్తశుద్ది లేదన్నారు. ఈ పార్ములా కేసును విచారించి చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆ కేసు చుట్టే రాజకీయాలను తిప్పడం వల్ల ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేస్తున్నారన్నారు. లిక్కర్ కేసులో బీఆర్‌ఎస్‌ను ఓడిరచామని, ఢిల్లీలోనూ కేజ్రీవాల్‌ను ఓడిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.
కేంద్రంలోని బీజేపీ అవినీతిపై మాట కూడా మాట్లాడకపోవడం దేనిని సూచిస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కరాములు మాట్లాడుతూ.. 25న జరిగే బహిరంగ సభకు సీపీఐఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌కరత్, బృందాకరత్, బీవీరాఘవులు, విజయరాఘవన్‌తో పాటు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీసభ్యులు చెరుపల్లి సీతారాములు, నాగ్నయ్య, బి.వెంకట్, సాయిబాబు వంటి కీలక నాయకత్వం పాల్గొంటుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, ఎం.అడివయ్య పాల్గొన్నారు.