రాజకీయాల్లో శాశ్వత శత్రువులుండరు, శాశ్వత మిత్రులూ ఉండరు. అలాగే ఒకే పార్టీ నుంచి ఒకే కుటుం బం నుంచి కూడా ప్రత్యర్థులుంటారనేది జగమెరిగిన సత్యం. సరిగ్గా ఇలాం టి పోటీ ఇప్పుడు కల్వకుంట కుటుంబంలో జరుగుతోందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్, కవిత మధ్య కొన్ని రోజులుగా నువ్వా.. నేనా అన్నట్టు పోటీ నడుస్తుందనే చర్చ జరుగుతోంది.
జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కొన్ని రోజులు సైలెంట్‌గానే ఉన్న కవిత ఇటీవల దూకుడు ప్రదర్శిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యకర్తల సమావేశాల్లో కాబోయే సీఎం కేటీఆర్.. కాబోయే సీఎం కవిత అంటూ నినాదానాలు చేసినట్టు బయట ప్రచారం జరిగింది.
అది ముగియక ముందే ఇటీవల ఇందిరా పార్క్ వద్ద బీసీ మహాసభను కవిత నిర్వహిస్తే.. అదే రోజు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ రైతు భరోసాపై మీడియా సమావేశం నిర్వహించారు. ఇది చూసిన విలేకరులకు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు.. ‘పోటీ అన్నా చెల్లెల మధ్యనా... లేకుంటే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీతోనా పెద్దసారూ (కేసీఆర్)’ అంటూ చర్చించుకుంటున్నారు.
రమేశ్ మోతె