15-02-2025 01:25:35 AM
* ముగిసిన మోదీ ద్వైపాక్షిక సమావేశం
* టారిఫ్‌ల విషయంలో మారని ట్రంప్ వైఖరి
* మోదీతో సమావేశానికి ముందే ఉత్తర్వులపై సంతకాలు
* తహవూర్ రాణాను అప్పగిస్తామన్న ట్రంప్
* స్వదేశానికి చేరుకున్న మోదీ..
వాషింగ్టన్, ఫిబ్రవరి 14: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ భేటీలో కీలక అంశాలు చర్చకు వచ్చాయి.
రక్షణ రంగం
అమెరికా మధ్య రక్షణ రంగంలో పదేండ్ల పాటు నిర్మాణాత్మక భాగస్వామ్యం కోసం ఈ ఏడాదిలోనే ఇరు దేశాలు ఒప్పందం చేసుకోనున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత రక్షణ రంగంలో అమెరికాకు చెందిన జావెలిన్ యాంటీ ట్యాంక్ మిస్సైల్స్, స్ట్రుకర్ ఆర్మ్‌డ్ ఫైటింగ్ వెహికిల్స్, ఆరు కొత్త పీ8ఐ తీరప్రాంత సర్వేలైన్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల సేకరణ వంటి అంశాలు ఉన్నాయి.
ఇంటర్నేషనల్ ట్రాఫిక్ ఇన్ ఆర్మ్స్ రెగ్యులేషన్ (ఐటీఎఆర్) నుంచి విడిభాగాల సరఫరాకు సంబంధించిన సమీక్ష. ఇరు దేశాలకు అవసరమైన రక్షణరంగ ఉత్పత్తుల విక్రయం.
అంతరిక్షం, ఎయిర్ డిపెన్స్, సముద్రయాన మిస్సైల్స్, సముద్రగర్భ యుద్ధ పరికరా లు. ఐదో జనరేషన్ ఫైటర్ జెట్‌లను, సముద్రగర్భ యుద్ధ పరికరాలను భారత్‌కు అప్పగిం చేందుకు సంబంధించిన పాలసీపై సమీక్ష జరుపుతామని అమెరికా తెలిపింది.
భారత్ కలిసి అటోనమస్ సిస్టమ్స్ ఇండస్ట్రీ అలయన్స్ (ఏఎస్‌ఐఏ)ను సంయుక్తంగా లాంచ్ చేశాయి. సముద్రగర్భ టెక్నాలజీకి సంబంధించి ఇరు దేశాలకు ఇది ఉపయోగపడనుంది.
వాణిజ్యం
ఇరువురు లీడర్లు “మిషన్ 500”ను లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030 వరకు రెండు దేశాల మధ్య 500 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగేలా చూడాలన్నారు.
అమెరికాలో 7.355 బిలియన్ డాలర్ల మేర భారత పెట్టుబడులు.. ఈ పెట్టుబడులు 3000 మందికి హై క్వాలిటీ ఉపాధిని కల్పించనున్నాయి.
ప్రపంచంలోని ఉక్కు ఎగుమతులపై 25 శాతం సుంకాలు వేస్తానని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం భారత ఎగుమతులపై ప్రభావం చూపనుంది. ఈ విషయంపై కూడా చర్చలు జరిగాయి.
సాంకేతికత
భారత్ “ట్రస్ట్” (ట్రాన్స్‌ఫార్మింగ్ ద రిలేషన్‌షిప్ యుటిలైజింగ్ స్ట్రాటెజిక్ టెక్నాలజీ)ని ప్రారంభించాయి. ఇది రెండు ప్రభు త్వాల మధ్య భాగస్వామ్యాన్ని పెంచనుంది.
అమెరికాఇండియా ఏఐ రోడ్ మ్యాప్ ఈ సంవత్సరం చివరి వరకు తుది దశకు చేరుకోనుంది. నెక్ట్స్ జనరేషన్ డాటా సెంటర్లు, ఏఐ ప్రాసెసింగ్ భాగస్వామ్యాలు ప్రకటించారు.
అంతరిక్ష రంగం, ఎనర్జీ, బయోటెక్నాలజీ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇండస్ ఇన్నేవేషన్ లా ఇండస్ ప్రకటించారు.
అమెరికాలో భారత ఫార్మా తయారీ రంగా న్ని మరింత విస్తరించాలని నిర్ణయించారు.
వివిధ టెక్ పరిశ్రమలలో వాడే అరుదుగా లభించే ఖనిజాలైన లిథియం, కోబాల్ట్ మొదలైన వాటి కోసం వ్యూహాత్మక ఖనిజ పునరుద్ధ రణ చొరవ.
అమెరికా నేషనల్ సైన్స్ పౌండేషన్ (ఎన్‌ఎస్‌ఎఫ్), భారత్‌కు చెందిన అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం.
ఎనర్జీ
భారత్ ఎనర్జీ సెక్యూరిటీ భాగస్వామ్యం కోసం కట్టుబడి ఉన్నట్లు ప్రకటిం చారు. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) లో భారత శాశ్వత సభ్యత్వం కొరకు మద్దతు ప్రకటిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
ఇండియా 123 పౌర అణుఒప్పందాలకు ఆమోదం తెలిపారు. దీని ద్వారా భారత్‌లో అమెరికా మరిన్ని అణు రియాక్టర్లను నిర్మించనుంది.
అణువిద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు చిన్న మాడ్యుల్ రియాక్టర్లను అనుసంధానించనున్నారు.
వలసలు
అమెరికాలో ఉంటున్న 3 లక్షల ఇండియన్ స్టూడెంట్ కమ్యూనిటీ అమెరికా ఎకానమీకి ఏడాదికి 8 బిలియన్ డాలర్లను వరకు అందిస్తున్నారు. అందుకోసమే అమెరికాలో జా యింట్ డిగ్రీస్, ఆఫ్ షోర్ క్యాంపసెస్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను విస్తరించేందుకు ఇరువురు అధినేతలు నిర్ణయం తీసుకున్నారు.
చట్ట విరుద్ధ వలసలు, మానవ అక్రమ రవాణా గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది.
బహుపాక్షిక సహకారం
ఇరు దేశాల అధినేతలు పాకిస్తాన్ వైఖరిని తప్పుబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో పాక్ విఫలమైందన్నారు.
26/11 ముంబై దాడుల నిందితుడు తహవూర్ రాణాను భారత్‌కు అప్పగిస్తామని ట్రంప్ ప్రకటించారు.
క్వాడ్ (ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా) కూటమి తరువాతి సమావేశానికి మోదీ, ట్రంప్ అధ్యక్షత వహించనున్నారు.
మెటా 50 వేల కిలోమీటర్ల మేర అండర్‌సీ కేబుల్ ప్రాజెక్ట్‌ను చేపట్టనుంది.
మీరు.. మేము కలిస్తే మెగా
భారత్, అమెరికా సంబంధాలకు ప్రధా ని మోదీ కొత్త అర్థం చెప్పారు. మీరు.. మే ము కలిస్తే అది మెగా భాగస్వామ్యంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. పలు అంశాలపై చర్చించిన అనంతరం ప్రధాని మోదీ ట్రంప్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్ర ధాని మాట్లాడుతూ.. మాగా(ఎంఏజీఏ)+మిగా (ఎంఐ జీఏ)= మెగా(ఎంఈజీఏ) అనే సమీకరణా న్ని పేర్కొన్నారు.
‘అధ్యక్షుడు ట్రంప్ నినాదమైన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మా గా)పై అమెరికా ప్రజల కు అవగాహన ఉంది. భారత ప్రజలు కూ డా వారసత్వం, అభివృద్ధిపై దృష్టి సారిస్తూ.. వికసిత్ భార త్ చేరుకోవడానికి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. అమెరికా భాషలో చెప్పాలంటే దీన్ని మేక్ ఇండియా గ్రేట్ అగైన్ (మిగా)గా పేర్కొనవచ్చు. అమెరికా, భారత్ రెండూ కలిసి పని చేసినప్పుడు.. ఇరు దేశా ల శ్రేయస్సు కోసం ఈ మాగా, మిగా కలిసి మెగా భాగస్వామ్యంగా మారుతుంది’ అని వివరించారు.