- విదేశాలకు సాయం కింద రూ. 5,483 కోట్లు
- ఎక్కువ లబ్ధిపొందేది భూటాన్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: భారత్ విదేశాలకు సాయం కింద రూ. 5,483 కోట్లు అందిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ కేటాయింపు ల్లో కాస్త తగ్గుదల కనిపించింది. అలాగే కేంద్ర విదేశాంగ శాఖకు మొత్తంగా రూ. 20,516 కోట్లు కేటాయించారు. బంగ్లాలో అధికారంలో ఉన్న యూనస్ సర్కారు ఓవర్ చేసినా కానీ మన దేశం మాత్రం ఆ దేశానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించడం గమనార్హం.
అంతే కాకుండా భారత వ్యతిరేఖ విధానాలు అవలంభిస్తున్న మాల్దీవులకు కూడా భారత్ చేసే సాయం పెరిగింది. ఎక్కువ సాయం పొందే దేశాల జాబితాలో భూటాన్ మొదటి స్థానంలో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరంలో భూటాన్‌కు రూ. 2,150 కోట్ల మేర కేటాయింపులు జరిగాయి. అ లాగే మాల్దీవులకు రూ. 600 కోట్లు కేటాయించారు.
అలాగే అఫ్ఘనిస్తాన్‌కు రూ. 100 కోట్లు కేటాయించారు. అఫ్ఘాన్‌కు కేటాయించే సా యం రెట్టింపు కావడం గమనార్హం. మయన్మార్‌కు అందించే సాయం రూ. 350 కోట్లుగా ఉంది. బంగ్లాకు రూ. 120 కోట్లు, నేపాల్‌కు రూ. 700 కోట్లు, శ్రీలంకకు రూ. 300 కోట్లు కేటాయించారు. మంగోలియా దేశానికి అతి తక్కువ గా రూ. 5 కోట్లు మాత్రమే కేటాయించారు.