calender_icon.png 2 October, 2024 | 4:03 AM

బిగ్‌బీదే వాయిస్.. కానీ డబ్బింగ్ ఆయన చెప్పరు!

29-09-2024 01:30:08 AM

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ఇటీవల దక్షిణాది చిత్రాల్లోనూ నటిస్తున్నారు. తెలుగులో ‘సైరా’, ‘కల్కి’ లాంటి భారీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు బిగ్‌బీ. ఇప్పుడు ఆయన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం ‘వేట్టయన్’లో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఫేక్ ఎన్‌కౌంటర్స్ నేపథ్యంలో ‘జై భీమ్’ ఫేమ్ జ్ఞానవేల్ రూపొందించిన చిత్రమిది.

దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో ముందుగా అమితాబ్ పాత్రకు సంబంధించి డబ్బింగ్‌ను ప్రకాశ్‌రాజ్‌తో చెప్పించారు. ఇటీవల అమితాబ్ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన చిన్నపాటి టీజర్‌లో ప్రకాశ్‌రాజ్ వాయిసే వినిపించింది. అయితే బిగ్‌బీకి ఆ వాయిస్ అస్సలు సూట్ కాలేదన్న విమర్శలు వినిపించాయి.

ప్రకాశ్‌రాజ్‌లాగే ఆయన వాయిస్ కూడా అంతే! అమితాబ్ గాత్రం ఎలా ఉంటోందో కూడా దక్షిణాది ప్రేక్షకులకు తెలుసు. దీంతో సామాజిక మాధ్యమాల్లో పూర్తిగా నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. అప్రమ త్తమైన చిత్రబృందం.. సినిమాలో బిగ్‌బీ పాత్రకు ప్రకాశ్ రాజ్ వాయిస్ కాకుండా ఆయ న గాత్రమే వినిపించేలా ఏర్పా ట్లు చేస్తోందట.

అలాగనీ అమితాబ్ సొంతంగా డబ్బిం గ్ చెప్పే పరిస్థితి లేదు. వేరే ధ్వన్యనుకరణ కళాకారులతోనూ డబ్బింగ్ చెప్పించ ట్లేదు. ఏఐ టెక్నాలజీ సహాయంతో అమితాబే డబ్బింగ్ చెప్పినట్టు మేనేజ్ చేయబోతున్నారట.  ఇలా బతికున్నవారి వాయిస్‌నూ ఏఐతో మేనే జ్ చేయడం విశేషమే.