08-02-2025 11:43:51 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలోని బస్టాండ్ లోపల రొడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంబాన్ని ఆర్టీసి బస్సు ఢీ కొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ సరఫరా లేని సమయంలో స్తంబాన్ని ఢీకొనడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ డిపోకు చెందిన ఎలక్రిక్ట్ మాచారెడ్డి బస్టాండ్‌లో నుండి బయటకు వస్తుండగా బస్సు విద్యుత్ స్తంబాన్ని ఢీకొంది. దీంతో ఒక విద్యుత్ స్తంభం నెలకొరగడంతో పాటు మరొక విద్యుత్ స్తంభం ఒకవైపు ఒరిగింది. వెంటనే ప్రయాణికులు బస్సు దిగారు. స్తంబాలకు ఉన్న విద్యుత్ వైరు బస్సుపై పడితే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని తెలిపారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని వివరించారు. బస్సు యాథావిధిగా కరీంనగర్ వైపు వెళ్లి పోయింది. అనంతరం విద్యుత్ అధికారులు రొడ్డు క్లియర్ చేసి విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు.