calender_icon.png 16 November, 2024 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైడెన్ మరోసారి విచిత్ర ప్రవర్తన

10-08-2024 12:47:58 AM

  1. ఓ కార్యక్రమంలో నేనేం చేస్తున్నా? అంటూ వ్యాఖ్య
  2. గందరగోళంలో పడ్డ సభికులు
  3. సిబ్బంది అప్రమత్తతతో జాగ్రత్త పడ్డ అధ్యక్షుడు

వాషింగ్టన్, ఆగస్టు 9: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన విచిత్ర ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే జ్ఞాపకశక్తి విమర్శలతో అధ్యక్ష బరి నుంచి వైదొలిగిన ఆయన తాజాగా వైట్‌హౌస్‌లో వరల్డ్ సిరీస్ విజయం తర్వాత టెక్సాస్ రేంజర్స్ గౌరవార్థం నిర్వహించిన కార్యక్రమంలో విచిత్రంగా ప్రవర్తించారు. వైట్‌హౌస్‌లోని ఈస్ట్ రూంలో జరిగిన కార్యక్రమంలో జెర్సీ, కౌబాయ్ బూట్లను ఆయనకు బహుమతిగా ఇవ్వగా ఆయన స్వీకరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆల్‌రైట్.. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను?అని చుట్టూ కొత్తగా చూశారు. అది గమనించినవారికి ఏమీ అర్థం కాలేదు. అనంతరం ఆ బహుమతులను తీసుకెళ్లడానికి మిలిటరీ సహాయకుడు రాగా తేరుకున్న బైడెన్.. సరదాగా నా జెర్సీ దొంగలిస్తున్నావా? అని అన్నారు. తర్వాత బైడెన్ సిబ్బంది సూచనతో అక్కడి నుంచి నిష్క్రమిస్తూ కొద్దిగా దూరంలో ఉన్న పిల్లలతో మాట్లాడారు. ఇప్పటికే బైడెన్ ఆరోగ్యం, సామర్థ్యంపై చర్చ జరుగుతున్న వేళ ఈ ఘటన విమర్శకులకు మరో అవకాశం ఇచ్చినట్లయింది. 

ఇటీవలే ఓ నివేదిక కూడా బైడెన్ ఆరోగ్య పరిస్థితిని వివరించింది. వయసురీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల జ్ఞాపకశక్తితోపాటు బైడెన్ అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అంచనా వేసింది. అంతేకాకుండా ఒబామా హయాంలోనూ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన.. దేశానికి సంబంధించిన కీలక రహస్య సమాచారాన్ని ప్రైవేట్ వ్యక్తులతో పంచుకున్నట్లు ఆరోపించింది. ఆయన కుమారుడు బ్యూ బైడెన్ మరణం విషయం గురించి సైతం బైడెన్ మరిచిపోయినట్లు తెలిపింది.