దేశ ప్రయోజనాల కోసమే నిర్ణయం
కమలాహ్యారిస్‌ను వారసురాలిగా ప్రతిపాదించిన అధ్యక్షుడు
వాషింగ్టన్, జూలై 21: అమెరికా అధ్యక్ష బరి నుంచి తప్పుకుంటున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. డెమోక్రటిక్ పార్టీ, దేశ ప్రయోజనాల కోసమే వైదొలుగుతున్నట్లు ఆదివారం స్పష్టం చేశారు. తన స్థానంలో డెమోక్రాట్ అధ్యక్ష అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‌ను బైడెన్ ప్రతిపాదించారు. తాను మాత్రం దేశ అధ్యక్షుడిగా పూర్తి కాలం కొనసాగుతానని వెల్లడించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడు తున్న బైడెన్‌ను ప్రెసిడెన్షియల్ రేసు నుంచి వైదొలగాలని సొంత పార్టీ నేతల నుంచి వస్తోన్న ఒత్తిడి నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు తాజాగా బైడెన్ కొవిడ్ బారిన పడటంతో ఆయనపై నేతల ఒత్తిడి మరింత పెరిగిన విషయం తెలిసిందే.