calender_icon.png 20 January, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూట్ మార్చిన బీదర్ దుండగులు

20-01-2025 12:00:00 AM

  1. పోలీసులను కన్ఫ్యూజ్ చేసేలా ఆనవాళ్లు వదిలి వెళ్తున్న దుండగులు
  2. వారితో ట్రావెల్ చేసిన ఆటో డ్రైవర్లను విచారించిన పోలీసులు 
  3. ఇప్పటికే నగరం దాటేసినట్లు అనుమానం

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 19 (విజయక్రాంతి): ఒకేరోజు రెండు రాష్ట్రాల్లో కాల్పులకు తెగబడి సంచలనంగా మారిన బీదర్ దుండుగల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరం అంతటా జల్లెడపట్టినా కూడా పోలీసులకు చిక్కకుండా దుండగులు చాకచక్యంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

పోలీసుల దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకే కొన్నిచోట్ల వారు ఆధారాలు వెళ్లినట్లు తెలుస్తోంది. బీదర్‌లో దొంగతనం అనంతరం నగరంలోని అఫ్జల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్‌కు, సికింద్రాబాద్ నుంచి తిరుమలగిరికి, ఆ తర్వాత మళ్లీ తిరుమలగిరి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

వీడియోల పరిశీలన.. 

ఈ కేసులో దుండగులు ట్రావెల్ చేసినట్లు అనుమానిస్తున్న ఇద్దరు ఆటో డ్రైవర్లను, దుండగులు షాపింగ్ చేసిన షాపు నిర్వాహకులను పోలీసులు విచారించారు. అలాగే దుండగుల వద్ద మొబైల్ ఫోన్ లేదని నిర్ధారణకు వచ్చారు. దీంతో కేవలం దుండగులు వదిలివెళ్లిన ఆనవాళ్ల కేసు దర్యాప్తు చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పటికే దుండగులు బిహార్ చేరుకున్నట్టుగా సమాచారం.